RRvsGT : జైపూర్ లో నెగ్గేది ఎవరు.?
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం నాడు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 10 April 2024 7:31 PM ISTజైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం నాడు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. అపజయమెరుగని రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ ఇప్పటి వరకు టోర్నీలో ఓటమి అంటూ లేని జట్టుగా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలు రెండింటిలోనూ, ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన అద్భుతమైన టెస్ట్ సిరీస్ తర్వాత యశస్వి జైస్వాల్ ఫామ్ మాత్రమే ఆతిథ్య జట్టుకు ఆందోళన కలిగించే ఏకైక అంశం. మరోవైపు గుజరాత్ రెండు మ్యాచ్‌లు గెలిచినా రెండు పరాజయాలు వెంటాడుతూ ఉన్నాయి. బుధవారం నాడు శుభ్‌మాన్ గిల్ సారథ్యంలోని టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ కు తొలి ఓటమిని చూపించాలని భావిస్తోంది.
రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలో RR ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. GT నాలుగు గేమ్‌లను గెలుచుకుంది.
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో RR గెలుపు-ఓటమి రికార్డు
ఆడిన మ్యాచ్‌లు: 55, RR గెలిచింది: 36, RR ఓడిపోయింది: 19
రాజస్థాన్‌లో RR vs GT IPL హెడ్-టు-హెడ్ రికార్డ్
ఆడిన మ్యాచ్‌లు: 1, RR విజయాలు: 1, GT విజయాలు: 0
RR vs GT మ్యాచ్ JioCinema యాప్‌లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఏప్రిల్ 10, బుధవారం రాత్రి 7:30 PM IST నుండి ప్రసారం చేయనున్నారు.