గుజరాత్ ఆశలపై నీళ్లు చ‌ల్లిన‌ వర్షం..ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్‌..!

ఐపీఎల్ 2024 63వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది

By Medi Samrat  Published on  14 May 2024 6:32 AM IST
గుజరాత్ ఆశలపై నీళ్లు చ‌ల్లిన‌ వర్షం..ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్‌..!

ఐపీఎల్ 2024 63వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్‌లో టాస్ కూడా కుదరలేదు.

అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా IPL 2024 63వ మ్యాచ్ రద్దు చేయబడింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆశలపై వర్షం నీళ్లు చల్లడంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మూడో జట్టు గుజరాత్. ఇంతకు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయ్యాయి.

మ్యాచ్ రద్దు కావడంతో కోల్ కతా, గుజరాత్ జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ప్లేఆఫ్ సమీకరణంలో కొనసాగడానికి గుజరాత్‌కు రెండు పాయింట్లు అవసరం. కానీ మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ 13 మ్యాచ్‌లలో 11 పాయింట్లతో ఉంది. ఇక గుజ‌రాత్‌ జట్టు తదుపరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉంది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గెలిచినా.. ఆ జట్టు గరిష్టంగా 13 పాయింట్లకు చేరుకోగలదు.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఇప్పటికే నాలుగు జట్లు 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లను కలిగి ఉన్నాయి. దీంతో ప్లేఆఫ్‌కు చేరుకోవాల‌న్న GT టీమ్ క‌థ‌ ముగిసింది. కోల్‌కతా జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇప్పుడు ప్లే ఆఫ్‌కు చేరుకోవడానికి ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇంకా మూడు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పోటీలో ఉన్న జట్లు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్. మ్యాచ్ రద్దయిన తర్వాత గుజరాత్ ఆటగాళ్లు ల్యాప్ ఆఫ్ హానర్ చేశారు. మైదానం అంతా తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Next Story