టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో బయో బబుల్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్-2022 అని.. భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ లో బయో బబుల్ నుంచి ఆటగాళ్లకు విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచీ క్రికెటర్లు బయో బబుల్‌లోనే గడుపుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ఆటగాళ్లు.
ఈ నేపథ్యంలో జై షా మాట్లాడుతూ.. ఐపీఎల్-2022తో బయో బబుల్ విధానం ముగుస్తుంది. టీమిండియా- సౌతాఫ్రికా సిరీస్ నుంచి ఇది ఉండబోదు. ఆటగాళ్లకు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తాం అని చెప్పుకొచ్చారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించనుంది. జూన్ 9న మొదటి మ్యాచ్ జరుగనుండగా.. జూన్ 19 నాటి మ్యాచ్‌తో సిరీస్ ముగియనుంది. ఇప్పటికే బీసీసీఐ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.