మేమింకా అలాంటి గేమ్ ఆడలేదు.. ఆ మ్యాచ్ కూడా చూస్తారు

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా బ్యాట్ తో రాణించని కెప్టెన్ రోహిత్ శర్మకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచారు

By Medi Samrat
Published on : 5 March 2025 3:53 PM IST

మేమింకా అలాంటి గేమ్ ఆడలేదు.. ఆ మ్యాచ్ కూడా చూస్తారు

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా బ్యాట్ తో రాణించని కెప్టెన్ రోహిత్ శర్మకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 28, 15, 20, 41 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తక్కువ పరుగులు చేసినా ప్రభావం మాత్రం అమోఘం అంటూ కితాబిచ్చారు.

కెప్టెన్ పరుగుల గురించి మాత్రమే కాకుండా అతడు చూపించే ప్రభావం గురించి కూడా ఆలోచించాలని గౌతమ్ గంభీర్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రాబోతోంది, ఇంకా మంచి ప్రదర్శన రోహిత్ ఇస్తాడని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులుగా సంఖ్యలు, సగటులను మాత్రమే చూస్తారు. కానీ ఒక జట్టుగా, మేము సంఖ్యలు లేదా సగటులను చూడమన్నారు. దూకుడైన ఆటతీరుతో కెప్టెన్‌ ఆడుతుంటే అంతకంటే ఇంకేం కావాలని గంభీర్ అన్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు సానుకూల సంకేతాలు ఇవ్వడంలో రోహిత్ ముందుంటాడని, నిర్భయంగా ఆడేందుకు అతడే దిక్సూచి అని తెలిపారు గంభీర్. మీరు పరుగులనే చూస్తారు.. మేం అతడి ప్రభావం ఎంతనేది పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. గంభీర్ జట్టులోని ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. తాము ఇంకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదని ఆ మ్యాచ్ కూడా చూస్తారని నవ్వుతూ చెప్పారు గంభీర్.

Next Story