నా దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదు.. సూర్యకు గంభీర్ మద్దతు
గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంపూర్ణ మద్దతు తెలిపాడు.
By - Medi Samrat |
గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంపూర్ణ మద్దతు తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని గంభీర్ స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ గత నెలలో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ భారత టీ20 కెప్టెన్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 72 పరుగులు మాత్రమే చేశాడు.
జట్టు దూకుడు మనస్తత్వంతో ఆడుతున్నప్పుడు ఇలాంటివి సహజమని గంభీర్ జియోహోట్‌స్టార్‌తో చెప్పాడు. సూర్య బ్యాటింగ్ ఫామ్ గురించి నేను చింతించలేదు ఎందుకంటే మా డ్రెస్సింగ్ రూమ్‌లో మేము అల్ట్రా-దూకుడు ఆలోచనకు కట్టుబడి ఉన్నాము. మాకు ఈ రకమైన ఆలోచన ఉన్నప్పుడు.. వైఫల్యం గురించి పెద్దగా పట్టింపు లేదన్నాడు. సూర్య విమర్శకులకు సమాధానం ఇవ్వడానికి 30 బంతుల్లో 40 పరుగులు చేయడం చాలా సులభం, సూర్యకుమార్ యాదవ్ పోరాడితే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ప్రతిభావంతులు నిర్భయంగా ఆడి ఆకట్టుకున్నారు. తన దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదని గంభీర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను దానిని ఆసియా కప్‌లో కొనసాగించాడు. సూర్య తన లయను కనుగొన్నప్పుడు, అతను తదనుగుణంగా బాధ్యత తీసుకుంటాడని పేర్కొన్నాడు.
గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్‌తో తన భాగస్వామ్యం గురించి.. ఇద్దరు కలిసి జట్టును ఎలా నిర్మిస్తున్నారనే దాని గురించి మాట్లాడాడు. 'సూర్య మంచి వ్యక్తి. మంచి వ్యక్తులు మాత్రమే మంచి నాయకులు అవుతారు. మ్యాచ్‌పై నాకున్న అవగాహన ఆధారంగా అతనికి సలహా ఇవ్వడం నా పాత్ర. దాని తరువాత సూర్య అతని బృందం చూసుకుంటుంది. అతడి పాత్ర మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిబింబిస్తుంది. గత ఏడాదిన్నరగా సూర్యకుమార్ యాదవ్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడని కితాబిచ్చాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్ బెర్రా వేదికగా జరగనుంది. సూర్య తొలి మ్యాచ్‌లోనే లయను పుంజుకోవడానికి ప్రయత్నిస్తాడని అంతా భావిస్తున్నారు.