బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. షెడ్యూల్ వ‌చ్చేసింది..!

భారత్-ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభం కానుంది

By Medi Samrat  Published on  26 March 2024 2:17 PM IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. షెడ్యూల్ వ‌చ్చేసింది..!

భారత్-ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 3 నుంచి 7 వరకు చివరి మ్యాచ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్ర‌క‌టించింది.

పెర్త్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ అనంతరం.. రెండో మ్యాచ్‌ డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరగనుంది. సిరీస్‌లో పింక్‌ బంతితో జరిగే ఏకైక డే-నైట్ టెస్టు ఇదే. దీని తర్వాత మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు బ్రిస్బేన్‌లో జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు మరోసారి తలపడనున్నాయి. సిరీస్‌లో ఇది నాలుగో టెస్టు. ఈ సిరీస్ చివరి మ్యాచ్ 2025 జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరుగుతుంది.

Next Story