బాబర్ ఆజమ్ ను సపోర్ట్ చేయడంతో కాంట్రాక్ట్ పోయింది..!

ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మధ్యలో బాబర్ ఆజమ్ కు విశ్రాంతి ఇచ్చినందుకు పాకిస్థాన్ జాతీయ క్రికెట్ బోర్డును బహిరంగంగా విమర్శించిన క్రికెటర్ ఫఖర్ జమాన్‌ కు ఊహించని షాక్ తగిలింది.

By Kalasani Durgapraveen  Published on  27 Oct 2024 3:30 PM IST
బాబర్ ఆజమ్ ను సపోర్ట్ చేయడంతో కాంట్రాక్ట్ పోయింది..!

ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మధ్యలో బాబర్ ఆజమ్ కు విశ్రాంతి ఇచ్చినందుకు పాకిస్థాన్ జాతీయ క్రికెట్ బోర్డును బహిరంగంగా విమర్శించిన క్రికెటర్ ఫఖర్ జమాన్‌ కు ఊహించని షాక్ తగిలింది.సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి ఫఖర్ జమాన్ ను తొలగించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అక్టోబర్ 27, ఆదివారం నాడు 2024-25 సీజన్‌కు సంబంధించిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. పలువురు తొలిసారిగా కాంట్రాక్ట్‌ను పొందగా, కొంతమంది స్టార్ ఆటగాళ్ల పేర్లు కనిపించ లేదు.

ఫఖర్ జమాన్ అంతకుముందు సీజన్‌లో సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో కేటగిరీ Bలో భాగంగా ఉన్నారు. బాబర్ ఆజమ్ కు పాక్ క్రికెట్ బోర్డు విశ్రాంతి ఇచ్చిందనే నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించిన కొద్ది వారాల తర్వాత జమాన్ ను తొలగించారు. అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు పీసీబీ అధికారులు 'షోకాజ్' నోటీసు జారీ చేసింది. ఈ సంఘటన తర్వాత జమాన్ ఎనిమిదేళ్లలో మొదటిసారిగా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2024 T20 ప్రపంచ కప్‌లో పాక్ జట్టు తరపున చివరిసారిగా ఆడాడు. ఫఖర్‌తో పాటుగా ఇఫ్తికర్ అహ్మద్, హసన్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌ల కొత్త జాబితాలో స్థానాన్ని కోల్పోయారు.

కేటగిరీ A (2): బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్

కేటగిరీ B (3): నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మరియు షాన్ మసూద్

కేటగిరీ సి (9): అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్

కేటగిరీ D (11): అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ అలీ, మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్


Next Story