కేవైసీ అప్‌డేట్ పేరుతో మోస‌పోయిన‌ మాజీ క్రికెటర్.. అకౌంట్‌ నుంచి డబ్బు మాయం

Ex-cricketer Vinod Kambli loses over Rs 1 lakh to KYC update fraud. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మోస‌పోయాడు. కేవైసీ సమాచారం అప్‌డేట్ చేస్తానని

By Medi Samrat  Published on  10 Dec 2021 9:52 AM GMT
కేవైసీ అప్‌డేట్ పేరుతో మోస‌పోయిన‌ మాజీ క్రికెటర్.. అకౌంట్‌ నుంచి డబ్బు మాయం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మోస‌పోయాడు. కేవైసీ సమాచారం అప్‌డేట్ చేస్తానని ఓ ఫేక్‌ ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వినోద్ కాంబ్లీ బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకొని రూ. 1 లక్షకు పైగా దోచుకున్నాడు. కాంబ్లీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. డిసెంబర్ 3న కాంబ్లీకి ఫేక్‌ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ నుండి కాల్ వచ్చింది. మీ KYC వివరాలను అప్‌డేట్ చేయడానికి మొబైల్ ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయమని కాలర్ కాంబ్లీని కోరాడు. ఆ అప్లికేషన్ ద్వారా కాంబ్లీ మొబైల్ ఫోన్‌కి రిమోట్ యాక్సెస్ ఇచ్చింది.

కాంబ్లీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. మోసగాడు అతని ఫోన్‌కి రిమోట్ యాక్సెస్ పొందాడు. త‌ద్వారా కాంబ్లీ బ్యాంక్ వివరాలను వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను చూడగలిగాడు. కాల్ ఆన్‌లో ఉండ‌గానే.. అతని ఖాతా నుండి డబ్బు బదిలీ చేయబడిందని పోలీసు అధికారి తెలిపారు. పలు డెబిట్ లావాదేవీల్లో కాంబ్లీ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 1.1 లక్షలు డ్రా చేయబడ్డాయి. అతను వెంటనే తన బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేసి తన ఖాతాను బ్లాక్ చేశాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. బాంద్రా పోలీసులు, సైబర్ పోలీసులు, బ్యాంక్ సహాయంతో కాంబ్లీ న‌గ‌దును తిరిగి పొందారు. కాంబ్లీ ఖాతా నుంచి ఏ ఖాతాకు నిధులు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయో వాటిపై దర్యాప్తు అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. డబ్బును తిరిగి పొందడంలో సహాయం చేసినందుకు కాంబ్లీ పోలీసులకు ధన్యవాదాలు చెప్పాడు.


Next Story
Share it