టీ20 ప్ర‌పంచ క‌ప్ విజేత ఇంగ్లండ్

England outclass Pakistan to win their 2nd T20 World Cup title. ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ 49 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేయడంతో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్

By Medi Samrat  Published on  13 Nov 2022 5:25 PM IST
టీ20 ప్ర‌పంచ క‌ప్ విజేత ఇంగ్లండ్

ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ 49 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేయడంతో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 138 పరుగులు ఛేదించి ఇంగ్లండ్ పాకిస్థాన్‌ను ఓడించింది. పాక్ బౌల‌ర్ల‌లో హ‌రీస్ ర‌వూప్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతకుముందు.. శామ్ కుర్రాన్ 12 పరుగులకు 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పాకిస్థాన్‌ను 8 వికెట్లకు 137 పరుగులకు పరిమితం చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పురుషుల క్రికెట్‌లో ఏకకాలంలో 50 ఓవర్ల ప్రపంచకప్, T20 ప్రపంచకప్ టైటిళ్లను సాధించిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. వెస్టిండీస్ తర్వాత రెండు T20 ప్రపంచ కప్ టైటిల్‌లను గెలుచుకున్న రెండవ జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.




Next Story