అదే మా ఓటమికి కారణం: ఇంగ్లండ్ కెప్టెన్

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు

By -  Knakam Karthik
Published on : 6 March 2026 2:59 PM IST

Sports News, Cricket, T20 World Cup 2026, India, England

అదే మా ఓటమికి కారణం: ఇంగ్లండ్ కెప్టెన్

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను దెబ్బతీసిందని, ఫీల్డింగ్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామన్నాడు. పిచ్‌ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని, ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని, బంతి నెమ్మదిగా వస్తుందని భావించామని, కానీ బంతి బ్యాట్‌పైకి చక్కగా వచ్చిందన్నాడు. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా శాంసన్ క్యాచ్ వదిలేసి నేను పెద్ద తప్పు చేశానన్నాడు. యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్రదర్శనపై బ్రూక్ ప్రశంసలు కురిపించాడు. బెథెల్ అద్భుతంగా ఆడాడు.

భవిష్యత్తులో అతను భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తాడని చమత్కరించాడు. తొలి బంతి నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడన్నాడు. ఈ టోర్నమెంట్‌లో తమ జట్టు ప్రదర్శన బాగుందని, ఆడిన తీరు పట్ల గర్వంగా ఉంద‌ని బ్రూక్ అన్నాడు.

Next Story