ఇంగ్లాండ్ న‌డ్డివిరిచిన పేస్ గుర్రం బుమ్రా

England All Out For 110. టీమిండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం

By Medi Samrat  Published on  12 July 2022 8:01 PM IST
ఇంగ్లాండ్ న‌డ్డివిరిచిన పేస్ గుర్రం బుమ్రా

టీమిండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 110 పరుగులకే ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో రాణించిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులకు 6 వికెట్లతో వన్డేల్లో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. మొహమ్మద్ షమీ మూడు వికెట్‌లు ప‌డ‌గొట్ట‌గా.. మిగిలిన ఒక వికెట్‌ను ప్రసిద్ధ్ కృష్ణ కైవసం చేసుకున్నాడు.

జోస్ బట్లర్ 32 బంతుల్లో 30 పరుగులు చేసి ఇంగ్లండ్ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా విరాట్ కోహ్లి ఆటకు దూరం కావడం గమనార్హం. మరోవైపు, పొత్తికడుపు ఒత్తిడి కారణంగా అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్లేయింగ్ XIకి దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. అదే ఆత్మ‌విశ్వాసంతో వన్డే సిరీస్‌ను నెగ్గాల‌ని చూస్తోంది.











Next Story