హైదరాబాద్ టెస్టులో మ్యాచ్ ను శాసించే స్థాయిలో భారత్

హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతూ ఉండగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి

By Medi Samrat  Published on  26 Jan 2024 3:27 PM GMT
హైదరాబాద్ టెస్టులో మ్యాచ్ ను శాసించే స్థాయిలో భారత్

హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతూ ఉండగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి భారత జట్టు 421 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా (81), అక్షర్ పటేల్ (35) పరుగులతో ఉన్నారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన భారత్ రెండో రోజు మూడు సెషన్స్ మంచి రన్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 80, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. శుభ్ మాన్ గిల్ 23, కేఎల్ రాహుల్ 86, శ్రేయాస్ అయ్యర్ 35, శ్రీకర్ భరత్ 41, రవిచంద్రన్ అశ్విన్ 1 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2 వికెట్లు తీశారు. జాక్ లీచ్, రెహన్ అహ్మద్ కు తలో వికెట్ దక్కింది. ఏ మాత్రం అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను భారత బ్యాటర్లు ఓ ఆటాడేసుకున్నారు. భారత బ్యాటర్లు అనవసరమైన షాట్స్ ఆడేందుకు పోయి వికెట్లు కోల్పోయారు తప్పితే ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతమైన బంతులు వేయలేకపోయారు. ఇక మూడో రోజు నుండి పిచ్ స్పిన్ కు మరింత సహకరించే అవకాశం ఉండడంతో ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ ను కాపాడుకోవాలంటే అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది.

Next Story