దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా.?

ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయిన తర్వాత తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ను ఆడి ఉండవచ్చని వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ సూచించాడు.

By Medi Samrat  Published on  23 May 2024 11:02 AM IST
దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా.?

ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయిన తర్వాత తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ను ఆడి ఉండవచ్చని వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ సూచించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కార్తీక్ తన గ్లవ్స్ తీయగా.. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఉండగా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత 38 ఏళ్ల దినేష్ కార్తీక్ విరాట్ కోహ్లీని భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. అయితే దినేష్ కార్తీక్ IPL నుండి తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. IPL 2024 ఆటగాడిగా అతని చివరి సీజన్ కావచ్చు.

ఓటమి తర్వాత ఆటగాళ్ళు మైదానం నుండి బయటికి వెళ్లే ముందు దినేష్ కార్తీక్ ను గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవించారు. ఈ సీజన్‌లో RCB మొదటి 8 మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో RCB ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్‌ లో 257 మ్యాచ్‌ల్లో 4842 పరుగులు చేశాడు. అందులో 22 అర్ధ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 పరుగుల జాబితాలో కార్తీక్ ఉన్నాడు.

Next Story