ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అలా జ‌ర‌గాల్సిందే..!

IPL 2024 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.

By Medi Samrat  Published on  8 May 2024 6:05 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అలా జ‌ర‌గాల్సిందే..!

IPL 2024 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఢిల్లీకి ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా నిలుపుకుంది. 12వ మ్యాచ్‌ల‌లో ఢిల్లీ జట్టు ఆరో విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టు మొత్తం 12 పాయింట్లు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ అద్భుత విజయాల‌ను నమోదు చేస్తే.. ఆ జట్టుకు 16 పాయింట్లు ఉంటాయి.

అయితే 16 పాయింట్ల తర్వాత కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ టిక్కెట్ కన్ఫర్మ్ కాదు. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ కూడా 16 పాయింట్లతో నెట్ రన్ రేట్‌లో ఢిల్లీ కంటే ముందంజలో ఉన్నాయి. ఇదొక్కటే కాదు.. ఢిల్లీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ లు కూడా 12 పాయింట్లతో ఉన్నాయి.

సీఎస్‌కే, హైదరాబాద్, లక్నో జట్లకు ఇంకా మూడు మ్యాచ్‌లు చొప్పున‌ మిగిలి ఉండడం గమనార్హం. రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే.. ఈ జట్లూ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని ఓడిపోవాలని ఢిల్లీ ప్రార్థించాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 20 బంతుల్లో 50 పరుగులు చేయగా, అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 65 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో ట్రిస్టన్ స్టబ్స్ కేవలం 20 బంతుల్లో 41 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు, దీని కారణంగా ఢిల్లీ జట్టు స్కోరు 221 పరుగులకు చేరుకుంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 201 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అతను జట్టును గెలిపించ‌లేక‌పోయాడు.

Next Story