సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు టీమిండియాకు షాక్‌.. స్టార్ ప్లేయర్ ఔట్.!

డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20లు, వన్డేలతో పాటూ రెండు

By Medi Samrat  Published on  6 Dec 2023 3:29 PM IST
సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు టీమిండియాకు షాక్‌.. స్టార్ ప్లేయర్ ఔట్.!

డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20లు, వన్డేలతో పాటూ రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడ‌నుంది. ఈ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. అయితే టీ20 సిరీస్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు స్టార్ ఆటగాడు ఈ సిరీస్ మొత్తానికి దూర‌మ‌వుతాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

దీపక్ చాహర్ తండ్రి ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ఆయ‌న‌ క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఈ కారణంగా దీపక్ ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. డిసెంబర్ 10 నుంచి 14 వరకు జరిగే టీ20 సిరీస్‌కు కూడా అత‌డు దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. టీమిండియా దక్షిణాఫ్రికాకు బయల్దేరినా దీపక్ చాహర్ మాత్రం జట్టుతో వెళ్లలేదు. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో అతడు ఆడడంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

ఇక భారత జట్టులోని టీ20, వన్డే జట్లను పరిశీలిస్తే.. టీ20కి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా, వన్డేల‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ రెండు జట్లలోనూ నలుగురు పేసర్లు ఉన్నారు. ప్రపంచకప్ తర్వాత శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చారు. చాహర్ సిరీస్‌లో ఆడ‌కుంటే శార్దూల్ ఠాకూర్ టీమ్ ఇండియాలోకి వ‌చ్చే అవకాశం ఉంది.

టీ20 జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవిష్‌యాదవ్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్. , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్.

వన్డే జట్టు :

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పటీదార్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర సింగ్ చాహల్, అర్ష్‌దీప్ చాహల్, ముఖేష్ కుమార్.

Next Story