సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Medi Samrat Published on 17 Oct 2024 3:37 PM ISTఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ జట్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా ప్రకటించాడు. రాబోయే సీజన్‌లో బౌలింగ్ కోచ్‌గా ఉండలేనని చెప్పాడు.
డేల్ స్టెయిన్ ఎక్స్‌లో.. ఐపీఎల్‌లో బౌలింగ్ కోచ్‌గా కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు నేను IPL 2025కి రాలేను అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024 నుంచి స్టెయిన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను కోచ్‌గా నియమించింది. అయితే.. SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో ఉంటానని స్టెయిన్ ఈ ట్వీట్‌లో వెల్లడించాడు. నేను దక్షిణాఫ్రికాలో SA20 లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో కలిసి పని చేయడం కొనసాగిస్తాను. SA20లో జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. వరుసగా మూడోసారి గెలవడానికి ప్రయత్నిద్దాం అని పేర్కొన్నాడు.
డేల్ స్టెయిన్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. అతడు డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లతో ఆడాడు. అతడు చివరిసారిగా 2020లో RCB తరపున ఆడాడు. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరాడు. అయితే ఈసారి బౌలింగ్ కోచ్‌గా తిరిగి వచ్చాడు. IPL 2024లో పాట్ కమిన్స్ నాయకత్వంలో SRH ఫైనల్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.