IPL Auction : ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా రూ.20.5 కోట్లు పలికిన ఆటగాడు..!
ఐపీఎల్-2024 ఆటగాళ్ల వేలం ప్రక్రియ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ వేలంలో కోటి రూపాయల బేస్ ధర ఉన్న రోమన్ పావెల్ కోసం
By Medi Samrat Published on 19 Dec 2023 2:34 PM ISTఐపీఎల్-2024 ఆటగాళ్ల వేలం ప్రక్రియ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ వేలంలో కోటి రూపాయల బేస్ ధర ఉన్న రోమన్ పావెల్ కోసం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరకు రాజస్థాన్ జట్టు అతడిని రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది.
ట్రావిస్ హెడ్: చెన్నై, హైదరాబాద్ ట్రావిస్ హెడ్‌పై రూ. 2 కోట్ల బేస్ ధరతో పందెం కాశారు. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.8 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ చేయడం ద్వారా హెడ్ ఆస్ట్రేలియాకు ట్రోఫీని అందించాడు.
హ్యారీ బ్రూక్: రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న బ్రూక్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది, చివరకు రూ.4 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
కరుణ్ నాయర్ : రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న కరుణ్ నాయర్‌పై ఏ టీమ్ కూడా ఆసక్తి చూపలేదు.
స్టీవ్ స్మిత్ : ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్‌పై ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు.
రిలే రూసో : రూ. 2 కోట్ల బేస్ ధరతో ఈ ఆటగాడిపై ఏ జట్టు కూడా పందెం వేయలేదు. వేలంలో అమ్ముడుపోలేదు.
మనీష్ పాండే : రూ. 50 లక్షల బేస్ ప్రైస్ ఉన్న మనీష్ పాండేపై కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు.
వనిందు హసరంగా : శ్రీలంక స్పిన్నర్ బేస్ ధర రూ. 1.5 కోట్లు కావడంతో హైదరాబాద్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరే ఇతర జట్టు కూడా హసరంగపై ఆసక్తి చూపలేదు.
రచిన్ రవీంద్ర : రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న రవీంద్రను కొనుగోలు చేసేందుకు చెన్నై-ఢిల్లీ మధ్య పోటీ జరిగింది. 1.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున రవీంద్ర బంతితో, బ్యాటింగ్‌తో అద్భుతాలు చేశాడు.
శార్దూల్ ఠాకూర్: శార్దూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై, హైదరాబాద్‌లు ఆసక్తి చూపాయి. చివరకు చెన్నై అతడిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
అజ్మతుల్లా ఒమర్‌జాయ్ : అఫ్ఘానిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 50 లక్షల బేస్ ధరతో కొనుగోలు చేసింది.
పాట్ కమిన్స్ : కమిన్స్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై, ముంబైలు ఆసక్తి చూపాయి. తర్వాత RCB, హైదరాబాద్ ఈ రేసులో చేరాయి. చివరకు హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.5 కోట్లకు దక్కించుకుంది. ఓ ఆటగాడు ఐపీఎల్ చరిత్రలో రూ.20 కోట్ల ధర పలకడం ఇదే తొలిసారి.