రోహిత్‌పై వీడియో విడుదల చేసిన సీఎస్‌కే.. సంతోషంలో అభిమానులు..!
ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త అందించింది.
By Medi Samrat Published on 16 Dec 2023 2:00 PM ISTఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త అందించింది. అవును రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించి, హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించింది. ఈ వార్తపై ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. దీంతో అభిమానులు ముంబై ఇండియన్స్‌పై సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రోహిత్ శర్మకు సంబందించి చెన్నై సూపర్ కింగ్స్ క్యూట్ వీడియోను విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తన X ఖాతాలో షేర్ చేసిన వీడియోలో రోహిత్ శర్మ, చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. ఆ వీడియోలో 2013 నుంచి 2023 వరకు రోహిత్, ధోనీల ఫోటోలు ఉన్నాయి. వీడియోలో చూపిన చిత్రాలు మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో తీసినవి.. ఇందులో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ కరచాలనం చేస్తున్నారు. రోహిత్ శర్మ గౌరవార్థం చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోకు శీర్షిక.. 2013 నుండి 2023 వరకు.. రోహిత్‌పై చాలా గౌరవం ఉంది అని రాసింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించారనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్‌పై అభిమానులు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య, బుమ్రాలలో ఒకరు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి అర్హులు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వారి విధేయత ఫలించలేదని అంటున్నారు. హార్దిక్ పాండ్యా IPL 2024లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా కనిపించనున్నాడు.