రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?

క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు.

By Medi Samrat  Published on  29 Jan 2025 4:10 PM IST
రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?

క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు. Zapkey.com యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. అపార్ట్‌మెంట్, 1,298 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. లోధా గ్రూప్‌ చేపట్టిన ది పార్క్ ప్రాజెక్ట్‌లో భాగమైన లోధా మార్క్స్ లోని 45వ అంతస్తులో అపార్ట్మెంట్ ఉంది. ఇందుకు సంబంధించిన లావాదేవీ జనవరి 27 న నమోదు చేశారు. లావాదేవీకి ₹16,300 స్టాంప్ డ్యూటీ, ₹1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాలు చూపించాయి.

అపార్ట్‌మెంట్, రెండు పార్కింగ్ స్థలాలను మురళీకృష్ణన్ నాయర్‌కు లీజుకు ఇచ్చారు. Zapkey.com ద్వారా సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా రోహిత్ శర్మ, ఆయన తండ్రి జూలై 2013లో లోధా గ్రూప్ నుండి ₹5.45 కోట్లకు అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చారు.

Next Story