ప్లాన్ సక్సెస్.. ఒలింపిక్స్ లో క్రికెట్ సందడి

క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని తీసుకుని రావాలంటే ఒలింపిక్స్ లో చోటు దక్కాలని ఎంతో మంది..

By Medi Samrat
Published on : 13 Oct 2023 9:45 PM IST

ప్లాన్ సక్సెస్.. ఒలింపిక్స్ లో క్రికెట్ సందడి

క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని తీసుకుని రావాలంటే ఒలింపిక్స్ లో చోటు దక్కాలని ఎంతో మంది.. కొన్ని దశాబ్దాలుగా చెబుతూ వచ్చారు. ఆ దిశగా ఐసీసీ అడుగులు ముందుకు వేసింది. అనుకున్నట్లుగానే ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చారు. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.

ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్ కు ఆదరణ లభించిన విషయాన్ని ఐఓసీ గుర్తించింది. ఐఓసీ ఆమోదం లభించిన నేపథ్యంలో, ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్ (ఓపీసీ) సమీక్ష ఒక్కటే మిగిలుంది. ఇది లాంఛనమే అని అంటున్నారు. ఈ సమీక్షలో ఓటింగ్ చేపట్టి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు క్రికెట్ ను ఒలింపిక్స్ చార్టర్ లో చేర్చుతారు. క్రికెట్ ను చేర్చడం వల్ల ఒలింపిక్ కమిటీకి భారీ ఆదాయం రానుంది. లాస్ ఏంజెల్స్ ఆతిథ్యమిచ్చే ఒలింపిక్స్-2028లో క్రికెట్ తో పాటు స్క్వాష్, బేస్ బాల్, లాక్రోసీ, ఫ్లాగ్ ఫుట్ బాల్ క్రీడలకు కూడా స్థానం కల్పించేందుకు ఐఓసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1900లో తొలిసారి ఒలింపిక్స్ లో కనిపించిన క్రికెట్.. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒలింపిక్స్ లో కొత్తగా చేర్చాలనుకున్న ఐదు క్రీడల్లో క్రికెట్ కూడా ఉందని ఐఓసీ అధ్య‌క్షుడు థామ‌స్ బాచ్ ముంబై ఎగ్జిక్యూటీ బోర్డు మీటింగ్‌లో ఈ విష‌యాన్ని తెలిపారు.

Next Story