టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్‌ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 6 Jan 2024 10:50 AM GMTఐసీసీ టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్‌ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్-2024లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇది కాకుండా భారత జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ నేపధ్యంలో స్టార్ స్పోర్ట్స్.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రెండు జట్ల కెప్టెన్‌లను చూపించింది. అయితే ఈ పోస్టర్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి ఇరు జట్ల కెప్టెన్‌లతో కూడిన పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. ఇందులో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్‌గా చూపించింది. ఈ పోస్ట్ వెలువడిన తర్వాత.. 2024 T20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు సారథ్యం వహిస్తాడా అనే ప్రశ్న తలెత్తెంది. అలాగే రోహిత్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతాడా లేదా.. ఆడితే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా లేదా కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను జట్టులోకి తిరిగి రావడానికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేదు. గత ఏడాది కాలంగా హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏం జరుగుతుందదనే విషయమై తీవ్ర చర్చ నడుస్తుంది.
ఈసారి 2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా గ్రూప్ ఏలో చేరింది. తొలి గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు చోటు దక్కించుకున్నాయి. భారత జట్టు తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురుకావచ్చు.