ఆఖరి ఓవర్‌కు 35 పరుగులు కొట్టాలి.. ఆ తర్వాత అద్భుతమే జ‌రిగింది

club cricketer hits 6 sixes to help his team win title clash. ఒక బ్యాట్స్‌మెన్‌ ఓవర్ లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టగలడు.

By Medi Samrat
Published on : 18 July 2021 4:14 PM IST

ఆఖరి ఓవర్‌కు 35 పరుగులు కొట్టాలి.. ఆ తర్వాత అద్భుతమే జ‌రిగింది

ఒక బ్యాట్స్‌మెన్‌ ఓవర్ లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టగలడు. అదే ఆఖరి ఓవర్ లో 35 పరుగులు అవసరం అయినప్పుడు ఆరు బంతులను సిక్సర్లుగా మలిస్తే.. ఓడిపోతున్న జట్టును గెలిపిస్తే.. ఆ కిక్కే వేరప్పా అంటారు. అచ్చం అలాంటి ఇన్నింగ్స్ చూడొచ్చు. టీ20 క్రికెట్‌ లో ఆఖరి ఓవర్‌లో 35 పరుగులు విజయానికి అవసరం ఉన్నప్పుడు ఆడిన ప్రతీ బంతిని సిక్స్‌ కొట్టాడు. బాలీమెనా బ్యాట్ప్‌మెన్‌ జాన్ గ్లాస్ ఈ ఫీట్ ను సాధించాడు.

క్లబ్‌ క్రికెట్‌లో భాగంగా జాన్‌ గ్లాస్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది అద్భుతం సృష్టించాడు. ఐర్లాండ్ ఎల్‌వీఎస్‌ టీ20లో క్రెగాగ్, బాలీమెనా మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా గ్లాస్(87*) చితక్కొట్టాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

యువరాజ్‌ సింగ్‌, హర్షలే గిబ్స్‌, కీరన్‌ పొలార్డ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. ఒక మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదడమన్నది తొలిసారి.


Next Story