భారత్ సెమీస్ ఆశలు ఆవిరి.. న్యూజిలాండ్ ఘన విజయం

Clinical New Zealand ease through to the semifinal. భారత్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే భారత్ తర్వాతి మ్యాచ్ లో

By Medi Samrat  Published on  7 Nov 2021 1:15 PM GMT
భారత్ సెమీస్ ఆశలు ఆవిరి.. న్యూజిలాండ్ ఘన విజయం

భారత్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే భారత్ తర్వాతి మ్యాచ్ లో గెలిచి సెమీస్ చేరుతుందని భారత్ అభిమానులు ఆశించారు. అయితే భారత్ అభిమానులు ఆశించినట్లు జరగలేదు. న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో సెమీస్ చేరింది. న్యూజిలాండ్ తో సూపర్-12 గ్రూప్-2 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో నజీబుల్లా జాద్రాన్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. జాద్రాన్ 48 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న జద్రాన్ 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. జాద్రాన్ స్కోరు తర్వాత గుల్బదిన్ నాయబ్ చేసిన 15 పరుగులే రెండో అత్యధికం. కెప్టెన్ నబీ 14 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే 1, జేమ్స్ నీషామ్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు.

ఇక ఛేజింగ్ లో న్యూజిలాండ్ ను ఆఫ్ఘన్ బౌలర్లు ఎక్కడా ఇబ్బంది పెట్టలేకపోయారు. న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్‌ (28), డారియల్ మిచెల్‌ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు. నాలుగో ఓవర్లో మిచెల్‌ అవుటైన తర్వాత కేన్ విలియమ్సన్‌ క్రీజులోకి వచ్చి కివీస్ ను గెలుపుదిశగా నడిపించుకుంటూ వెళ్ళాడు. 9వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ మార్టిన్‌ గప్తిల్‌ను బౌల్డ్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అతనికి ఇది 400వ వికెట్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఎటువంటి మ్యాజిక్ కూడా కివీస్ చేయలేదు. విలియమ్సన్ 40 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. కాన్వాయ్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముజీబ్ కు ఒక వికెట్, రషీద్ కు ఒక వికెట్ దక్కింది. కివీస్ ఈ విజయంతో సెమీస్ కు క్వాలిఫై అయింది. భారత్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 ప్రపంచకప్ నుండి వైదొలిగింది.


Next Story
Share it