చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన మ‌హిళ‌.. చెవి లోప‌ల ఉన్న జీవిని చూసి అవాక్కైన డాక్ట‌ర్‌

Chinese Woman Suffering From Ear Pain Finds Spider Nesting Inside. చెవి నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా.. ఆ చెవిలో ఉన్న జీవిని చూసి అందరూ షాక్ అయ్యారు.

By Medi Samrat  Published on  28 April 2023 9:00 PM IST
చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన మ‌హిళ‌.. చెవి లోప‌ల ఉన్న జీవిని చూసి అవాక్కైన డాక్ట‌ర్‌

చెవి నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా.. ఆ చెవిలో ఉన్న జీవిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ మహిళ చెవిలో ఏకంగా సాలీడు నివసించడాన్ని మనం చూడవచ్చు. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక సాలీడు చెవి లోపల ఏకంగా తన సంతానాన్ని పెంచుతోంది. ఈ విషయం ఆమెకు డాక్టర్ చెప్పగా షాక్ అయ్యింది. ఏప్రిల్ 20న సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. డాక్టర్ మహిళ చెవిపై ఎండోస్కోపీ చేయగా సాలీడు కనిపించింది. సాలీడు ఏకంగా లోపల అల్లేయడం కూడా వైరల్ వీడియోలో గమనించవచ్చు. హుయిడాంగ్ కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో మహిళ కుడి చెవిపై ఎండోస్కోపీ నిర్వహించారు.

"ఈ స్పైడర్ లోపల చేసిన గూడు కర్ణభేరిని పోలి ఉంటుంది. మొదట ఇయర్ ఎండోస్కోప్ లోపలికి ప్రవేశించినప్పుడు, అసాధారణంగా ఏమీ కనిపించలేదు. కానీ మీరు దగ్గరగా చూస్తే, కింద ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది. " అని ఓటోలారిన్జాలజీ విభాగానికి చెందిన వైద్యుడు హాన్ జింగ్‌లాంగ్ ప్రెస్‌తో అన్నారు. అదృష్టవశాత్తూ స్పైడర్ విషపూరితమైనది కాదని డాక్టర్ చెప్పారు. మహిళ చెవి స్వల్పంగా దెబ్బతిందని అన్నారు. ఆ స్పైడర్ ను బయటకు తీసేశామని వైద్యులు తెలిపారు.


Next Story