ఆ సిరీస్ లో ఆడాలనుకుంటున్నా: పుజారా

ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే కోరికను భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా వ్యక్తం చేశాడు.

By Medi Samrat
Published on : 7 March 2025 8:15 PM IST

ఆ సిరీస్ లో ఆడాలనుకుంటున్నా: పుజారా

ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే కోరికను భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా వ్యక్తం చేశాడు. పుజారా చివరిసారిగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా భారత జట్టు తరపున ఆడాడు. ఆ మ్యాచ్ లో పుజారా 14, 27 పరుగులు చేశాడు. అప్పటి నుండి అతను దేశీయ క్రికెట్‌లో మంచి స్కోర్స్ చేస్తున్నా కానీ భారత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు.

ఇటీవలి కాలంలో భారత టెస్ట్ జట్టు అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుసగా సిరీస్‌లను కోల్పోయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు తొలిసారిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆస్ట్రేలియాలో భారత్ ఓటమి తర్వాత, మునుపటి రెండు సిరీస్ విజయాలలో పుజారా కీలక పాత్ర పోషించినందున అతడు టెస్ట్ జట్టులో ఉండాలనే చర్చ నడిచింది.

పుజారా కూడా దేశీయ క్రికెట్‌లో తన గొప్ప ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు, తిరిగి జట్టులోకి రావాలనే కోరిక మరింత ఎక్కువగా ఉందని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. అవకాశం ఇస్తే, దానిని రెండు చేతులతో ఒడిసి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పుజారా తెలిపారు. భారత జట్టుకు బౌలింగ్ ఉంది. అయితే బోర్డుపై మంచి పరుగులు ఉంచాలి. అలా చేయడానికి మాకు ఆటగాళ్ళు ఉన్నారు. మేము బౌలింగ్, పరిస్థితులను గౌరవించాలన్నాడు పుజారా. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారతదేశం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఉండనుంది.

Next Story