అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా

రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3లో టీమిండియా న‌యా వాల్‌గా ప్రసిద్ధి చెందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By అంజి
Published on : 24 Aug 2025 12:14 PM IST

Cheteshwar Pujara, cricket, retirement, india

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా 

రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3లో టీమిండియా న‌యా వాల్‌గా ప్రసిద్ధి చెందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఎక్స్‌లో రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేయడం ద్వారా సమాచారాన్ని అందించాడు. పుజారా భారత్ తరఫున మొత్తం 103 టెస్టు మ్యాచ్‌లు ఆడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడిన పుజారా 51 పరుగులు మాత్రమే చేశాడు. 2023లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పుజారా భారత్ తరఫున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

టీమ్ ఇండియా జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించడం, ఇవి మాటలలో వివరించలేనివి. రాజ్‌కోట్‌కు చెందిన ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి స్టార్‌లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాడు.

క్రికెట్‌ నాకు చాలా ఇస్తుందని నాకు అప్పుడు తెలియదు. అమూల్యమైన అవకాశాలు, అనుభవం, కారణం, ప్రేమ.. అన్నింటికంటే, నా రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ‌న్ని మాట‌ల‌లో వివరించలేనివి.. భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి నా రిటైర్మెంట్‌ను పూర్తి కృతజ్ఞతతో ప్రకటిస్తున్నానని త‌న రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు.

Next Story