ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ జరిగేది ఆ మైదానంలోనే..!

IPL 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ టైటిల్ మ్యాచ్ మే

By Medi Samrat  Published on  25 March 2024 7:31 PM IST
ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ జరిగేది ఆ మైదానంలోనే..!

IPL 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ టైటిల్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. మే 21 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బోర్డు ముందుగా 17 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించింది. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ మే 19న జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గౌహతిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

టోర్నమెంట్‌లోని మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. దీని తర్వాత మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది, ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ రెండో క్వాలిఫైయర్ మే 24న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభమైనప్పటికీ, ఈసారి మొత్తం టోర్నీ భారత్‌లోనే జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు.


Next Story