ఊపొచ్చింది.. మొదటి మ్యాచ్ లో గెలిచేది ఎవరో.?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ఫుల్ జోష్ తో ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  22 March 2024 8:00 PM IST
ఊపొచ్చింది.. మొదటి మ్యాచ్ లో గెలిచేది ఎవరో.?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ఫుల్ జోష్ తో ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన ఓపెనింగ్ సెర్మనీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పలు హిట్ సాంగ్స్ కు హుషారుగా డ్యాన్స్ చేయగా, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్, శ్వేతామోహన్ తదితరులు మెప్పించారు.

ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ టాస్ గెలవగా.. బెంగళూరు బ్యాటింగ్ ను ఎంచుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (w), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్

Next Story