రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బ‌తీసిన సీఎస్‌కే బౌల‌ర్లు

ఐపీఎల్‌లో బాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోవాలని చూస్తుండగా..

By Medi Samrat  Published on  12 May 2024 5:28 PM IST
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బ‌తీసిన సీఎస్‌కే బౌల‌ర్లు

ఐపీఎల్‌లో బాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోవాలని చూస్తుండగా.. గత మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న CSK తిరిగి పుంజుకుని నాకౌట్ రేసులో ఉండటానికి ప్రయత్నిస్తుంది.

సిమర్‌జిత్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండేల అద్భుత బౌలింగ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులకే పరిమితం చేసింది. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ 35 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చెన్నై తరఫున సిమర్‌జీత్ మూడు వికెట్లు తీయగా.. చివరి ఓవర్‌లో తుషార్ రెండు వికెట్లు తీశాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లు ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.

చెన్నై తరఫున సిమర్‌జిత్‌ సింగ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి రాజస్థాన్‌ను ఆదిలోనే దెబ్బ‌తీశాడు, ఇది ఇతర బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచింది. దీంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చివరి వరకు కోలుకోలేక 150 పరుగులు కూడా చేయలేకపోయారు.

Next Story