డెడ్ చీప్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ టికెట్ల‌ ధ‌ర‌లు..!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కనీస టిక్కెట్‌ను 1,000 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణ‌యించింది.

By Medi Samrat  Published on  16 Jan 2025 10:41 AM IST
డెడ్ చీప్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ టికెట్ల‌ ధ‌ర‌లు..!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కనీస టిక్కెట్‌ను 1,000 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణ‌యించింది. ఇది భారత కరెన్సీలో 310 రూపాయలకు సమానం. ఇది PCB అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. దుబాయ్‌లో జరగనున్న భారత్‌ మ్యాచ్‌ల టిక్కెట్‌ రేట్లు ఎంతన్నది మాత్రం పేర్కొనలేదు. ఒకవేళ భారత జట్టు సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ ఆడితే అవి కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.

కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లకు పీసీబీ కనీస టిక్కెట్లను పీకేఆర్ 1000 వద్ద ఉంచింది. రావల్పిండిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌ టిక్కెట్‌ల ధర 2000 పాకిస్తానీ రూపాయలు (620 భారత క‌రెన్సీ), సెమీ-ఫైనల్‌కు 2500 పాకిస్తాన్ రూపాయలు (776 భారత క‌రెన్సీ)గా నిర్ణయించబడింది.

PCB అన్ని మ్యాచ్‌ల VVIP టిక్కెట్‌లను 12,000 పాకిస్తాన్ రూపాయలు (3,726 భారత క‌రెన్సీ)గా ఉంచింది, అయితే సెమీ-ఫైనల్స్‌లో దీని ధర 25,000 రూపాయలు (7,764 భారతీయ క‌రెన్సీ) కాగా.. కరాచీలోని ప్రీమియర్ గ్యాలరీ టిక్కెట్‌లు 3,500 పాకిస్తాన్ రూపాయలు (1,086 భారత క‌రెన్సీ), లాహోర్‌లో 5,000 (1,550 భారత క‌రెన్సీ), రావల్పిండిలో పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రీమియర్ గ్యాలరీ టిక్కెట్ 7,000 (2,170 భారత క‌రెన్సీ)గా నిర్ణ‌యించింది. అయితే పాక్‌ టికెట్ ధ‌ర‌లపై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తున్నాయి. సినిమా ధ‌ర‌ల కంటే రేట్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌నే వాద‌న మొద‌లైంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న జరగనుంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సహా 6 దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో పాటు భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ గ్రూప్ Aలో భాగంగా ఉండగా, గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ 8 జట్ల మధ్య మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను దుబాయ్, పాకిస్తాన్‌లలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని భారత జట్టు ప‌ట్టుబ‌ట్టింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని నిర్ణయించారు. దీంతో టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరినా లేదా ఫైనల్స్‌కు అర్హత సాధించినా.. ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో ఆడుతుంది.

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత షెడ్యూల్

20 ఫిబ్రవరి - భారత్ vs బంగ్లాదేశ్

23 ఫిబ్రవరి - భారత్ vs పాకిస్థాన్

మార్చి 2 - భారత్ vs న్యూజిలాండ్

Next Story