ఐపీఎల్‌లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం

ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.

By Knakam Karthik
Published on : 10 March 2025 3:45 PM IST

Sports News, IPL, Central Government, Ban Tobacco And Alcohol

ఐపీఎల్‌లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం

ఐపీఎల్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వ కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయంతో నిర్వాహకులకు షాక్ తగిలినట్లయింది. ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది. సరోగసికి సంబంధించిన యాడ్స్ కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ప్లేయర్లను ఇలాంటి యాడ్స్‌తో సంబంధం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది.

'భారత యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు లేక మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదు. ఐపీఎల్, సంబంధిత కార్యక్రమాలు జరిగే స్టేడియం ప్రాంగణాలు, జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సెషన్‌ల సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దు. అమ్మకాలపై కూడా నిషేధం ఉంది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి' అని కేంద్రం ఆదేశించింది.

కాగా, మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు కోట్లలో వ్యూవర్​షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ప్రకటనలతో తమ వ్యాపారం పెంచుకోవాలని పలు కంపెనీలు భావిస్తుంటాయి. దీంతో బోర్డుకు కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ, ప్రభుత్వం తాజా ఆదేశాలు బోర్డు ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Next Story