నో నాయర్‌.. నో శాంసన్‌.. నో సిరాజ్‌.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడ‌నున్న భారత జట్టు ఇదే..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.

By Medi Samrat  Published on  18 Jan 2025 3:37 PM IST
నో నాయర్‌.. నో శాంసన్‌.. నో సిరాజ్‌.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడ‌నున్న భారత జట్టు ఇదే..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఈ టోర్నీకి రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీల‌కు చోటు ద‌క్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశ‌ప‌రిచాడు. సంజూ శాంసన్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కరుణ్ నాయర్‌కు జట్టులోకి వ‌స్తాడ‌ని భావించినా చోటు దక్కలేదు. అతనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని అజిత్ అగార్కర్ చెప్పారు. అతను బాగా ఆడాడు.. కానీ జట్టులో ప్రతి ఒక్కరికీ చోటు కష్టం అని పేర్కొన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

Next Story