ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీ త్వరలోనే భారత జాతీయ జట్టులోకి అడుగుపెడతాడని జోస్యం చెప్పారు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. లో 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రికార్డుల్లో ఒకటి) నమోదు చేయడం విశేషం.
పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్ 'ది గేమ్ ప్లాన్'లో వైభవ్ ఆటను అర్థం చేసుకునే విధానం, అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ చిన్న వయసులోనే అతను ప్రతి దానికి కౌంటర్ ఎటాక్ చేస్తున్నాడని, అతనికి 25 ఏళ్లు వచ్చేసరికి, అతనికి ఎలా బౌలింగ్ చేయాలో బౌలర్లకు కూడా అర్థం కాదని చెప్పాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత టీ20 అంతర్జాతీయ జట్టులో అతనికి కచ్చితంగా అవకాశం దక్కుతుందని అక్మల్ జోస్యం చెప్పాడు.