జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడికి నిరసిస్తూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌లో ఇవాళ రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో పాల్గొనే అందరు క్రికెటర్లు నల్ల బ్యాండ్‌లు ధరించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్లు రెండు నిమిషాలు మౌనం పాటించనున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మ చేకూరాలని గౌరవ సూచకంగా చీర్ గర్ల్స్ ఉండరని కూడా ప్రకటించారు.
కాగా మంగళవారం కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం పాటించాలని బీసీసీఐ నిర్ణయించింది. పహల్గామ్‌లో జరిగిన ఈ దారుణ దాడిని ప్రస్తుత, మాజీ భారత క్రికెటర్లు పలువురు ఖండించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.