విజయ్ హజారే ట్రోఫీ 2025లో తొలిరోజే బీహార్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడుతూ 50 ఓవర్లలో బీహార్ 574/6 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇది లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో (50 ఓవర్ల ఫార్మాట్)లో ప్రపంచంలోనే అత్యధిక జట్టు స్కోరు.
ఈ మ్యాచ్‌లో బీహార్ క్రికెట్ జట్టు కెప్టెన్ సకీబుల్ ఘనీ భారత ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అతను కేవలం 40 బంతుల్లో 128 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. సకీబుల్ 32 బంతుల్లోనే ఈ రికార్డు సృష్టించాడు.
యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అతడు గ్రేట్ ఎబి డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 84 బంతుల్లో 190 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లోనే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ లోహరుక కూడా దూకుడుగా బ్యాటింగ్ చేసి 56 బంతుల్లో 8 సిక్సర్లు, 11 ఫోర్లతో 116 పరుగులు చేశాడు.
దీంతో తమిళనాడు, ఇంగ్లండ్ జట్లను వెనక్కు నెట్టి బీహార్ మొదటి స్థానంలో నిలిచింది. 50 ఓవర్లలో బీహార్ 574/6 పరుగుల భారీ స్కోరును సాధించింది.
బీహార్-574/6, అరుణాచల్‌పై, 2025
తమిళనాడు-506/2, అరుణాచల్‌పై, 2022
ఇంగ్లాండ్-498/4, నెదర్లాండ్స్‌పై, 2022
సర్రే-496/4, గ్లౌసెస్టర్‌షైర్‌కు వ్యతిరేకంగా, 2007
ఇంగ్లాండ్-481/6, వర్సెస్ ఆస్ట్రేలియా, 2025