షాకింగ్‌.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన‌ ఇంగ్లండ్.!

జులై 31 నుంచి ఓవల్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

By Medi Samrat
Published on : 30 July 2025 5:24 PM IST

షాకింగ్‌.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన‌ ఇంగ్లండ్.!

జులై 31 నుంచి ఓవల్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయింగ్-11ని ప్రకటించింది. ఇందులో పెద్ద మార్పులు కనిపించాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్ కుడి భుజం గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆలీ పోప్‌కు జట్టు కెప్టెన్సీని అప్పగించారు. అదే సమయంలో మాంచెస్టర్ టెస్టు ఆడిన బౌలర్లలో క్రిస్ వోక్స్ మాత్రమే బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. ఓవల్ టెస్టు కోసం ఇంగ్లండ్ ప్ర‌క‌టించిన ప్లేయింగ్‌-11ని పరిశీలిద్దాం.

తాజాగా ప్ర‌క‌టించిన జ‌ట్టులో బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జోఫ్రా ఆర్చర్, బ్రేడన్ కార్సే, లియామ్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకోలేక‌పోగా.. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జాకబ్ బెత్‌వెల్ జ‌ట్టులోకి తిరిగి వచ్చారు. నాలుగో టెస్టు తర్వాత జట్టులోకి వచ్చిన జామీ ఓవర్టన్‌కు కూడా అవకాశం లభించింది.

భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి టెస్టు నుంచి అతడిని తప్పించడం జట్టుకు పెద్ద దెబ్బే. మూడు, నాలుగో టెస్టుల్లో అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

మాంచెస్టర్‌లో సెంచరీ చేసిన స్టోక్స్.. భారత్‌తో ప్రస్తుత సిరీస్‌లోని 4 టెస్టు మ్యాచ్‌ల్లో 304 పరుగులు చేశాడు. అతను 25.24 సగటుతో 17 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఓ బౌలర్‌కు ఇవే అత్యధిక వికెట్లు.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: ఇంగ్లాండ్ ప్లేయింగ్-11

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (సి), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్.

Next Story