సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. జూన్ 9 నుండి దక్షిణాఫ్రికాతో జరగబోయే ఐదు T20Iల కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ PBKS డెత్ బౌలర్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సీజన్‌లో 10 వికెట్లు తీసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్ట్‌కు సిద్ధమవుతున్న పలువురు సీనియర్లను T20Iలకు తప్పించారు.
దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు KL రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంక పర్యటనకు సీనియర్లు దూరమవడంతో భారత్‌కు నాయకత్వం వహించిన శిఖర్ ధావన్‌ను కూడా ఎంపిక చేయలేదు. రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ తిరిగి జట్టులోకి వచ్చారు.
భారత జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (విసి) (వికె), దినేష్ కార్తీక్ (వికె), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్ , భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.