టీ20ల్లో హార్థిక్ కు పగ్గాలు.. శ్రీలంకతో సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక
BCCI announces India's T20I and ODI squads for Sri Lanka series.స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2022 9:08 AM ISTస్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేరు వేరు జట్లను ప్రకటించింది బీసీసీఐ. టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్ లకు విశ్రాంతి ఇచ్చారు. అందరూ ఊహించినట్లుగానే హార్ధిక్ పాండ్య టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైఎస్ కెప్టెన్‌గా 360 డిగ్రీస్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు. యువ ఆటగాళ్లు శివమ్ మామి, ముఖేష్‌కుమార్‌లు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్‌లు వన్డే జట్టులోకి వచ్చారు. అయితే.. రిషబ్ పంత్ కు వన్డే జట్టులోనూ చోటు దక్కలేదు. టెస్టులు, టీ20లకు దూరమై కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న ధావన్‌కు మొండి చేయి ఎదురైంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలం కావడంతో అతడికి చోటు దక్కలేదు. ఇక గాయం నుంచి కోలుకోకపోవడంతో బుమ్రాను పరిగణలోకి తీసుకోలేదు. శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
టీ20 జట్టు : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముఖేశ్ కుమార్.
వన్డే జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్ పాండ్య(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ , ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్