టీమిండియా హోమ్ షెడ్యూల్ ఇదే..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల జట్టు 2025-26 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

By Medi Samrat
Published on : 2 April 2025 9:23 PM IST

టీమిండియా హోమ్ షెడ్యూల్ ఇదే..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల జట్టు 2025-26 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2న వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో భారత హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది, ఆ తర్వాత నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు T20Iలలో తలపడతారు. జూన్ 20 నుండి ఆగస్టు 5 వరకు ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టులు ఆడనున్న భారత జట్టు, ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో సత్తా చాటనుంది.

భారత్‌లో వెస్టిండీస్ పర్యటన

మొదటి టెస్ట్ – గురు, 02-అక్టోబర్-25 నుండి సోమవారం, 06-అక్టోబర్-25 | ఉదయం 9:30 | అహ్మదాబాద్

రెండో టెస్ట్ – శుక్ర, 10-అక్టోబర్-25 నుండి మంగళవారం, 14-అక్టోబర్-25 | ఉదయం 9:30 | కోల్‌కతా

భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన

మొదటి టెస్ట్ – శుక్ర, 14-నవంబర్-25 నుండి మంగళవారం, 18-నవంబర్-25 | ఉదయం 9:30 | న్యూఢిల్లీ

రెండో టెస్ట్ – శని, 22-నవంబర్-25 నుండి బుధవారం, 26-నవంబర్-25 | ఉదయం 9:30 | గౌహతి

మొదటి వన్డే – ఆదివారం, 30-నవంబర్-25 | మధ్యాహ్నం 1:30 | రాంచీ

రెండో వన్డే – బుధ, 03-డిసెంబర్-25 | మధ్యాహ్నం 1:30 | రాయ్‌పూర్

మూడో వన్డే – శని, 06-డిసెంబర్-25 | మధ్యాహ్నం 1:30 | వైజాగ్

మొదటి T20I – మంగళవారం, 09-డిసెంబర్-25 | సాయంత్రం 7:00 | కటక్

రెండవ T20I – గురు, 11-డిసెంబర్-25 | సాయంత్రం 7:00 | న్యూ చండీగఢ్

మూడో T20I – ఆదివారం, 14-డిసెంబర్-25 | సాయంత్రం 7:00 | ధర్మశాల

నాలుగో T20I – బుధవారం, 17-డిసెంబర్-25 | సాయంత్రం 7:00 | లక్నో

ఐదో T20I – శుక్ర, 19-డిసెంబర్-25 | సాయంత్రం 7:00 | అహ్మదాబాద్

నాలుగు టెస్టులు భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నందున స్వదేశీ సీజన్‌లో డే-నైట్ టెస్ట్ లేదనే తెలుస్తోంది.

Next Story