క్రికెట్ మైదానంలో హోరా హోరా పోరు చూసినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఆటగాళ్లు పరుగులు చేసినా, వికెట్లు తీసినా, క్యాచ్‌లు పట్టినా మైదానంలోని ప్రేక్షకులతో పాటు మ్యాచ్ చూసే అభిమానులు సందడి వేరుగా ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని సరదా సన్నివేశాలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ ఫన్ని ఘటననే జరిగింది.
ఇంగ్లాండ్‌లో విలేజ్ క్రికెట్ టోర్నిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఒక బ్యాట్స్‌మెన్ ఔటైన తరువాత మరో బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వస్తుంటాడు. అలా ఓ బ్యాటర్ ఔటైన తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ చేసిన పని నవ్వులు తెప్పించింది. హెల్మెట్ అయితే పెట్టుకుని వచ్చాడు కానీ.. ప్యాడ్లను ధరించడం మరిచిపోయాడు. వికెట్ల వద్దకు వచ్చి గార్డు తీసుకుంటూ ఉన్నాడు. అంపైర్ సైతం అది గమనించలేదు. కానీ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు గమనించి సదరు విషయాన్ని చెప్పగా.. తొలుత అతను తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వారు అలా చెబుతున్నాడని బావించాడు. అయితే.. మళ్లీ వారు నిజం చూసుకోమని చెప్పగా అప్పటికి విషయం అర్థమై డగౌట్‌కు పరిగెత్తాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దట్స్ సో విలేజ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.