భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. భారత్ పర్యటన తమ ఆటగాళ్లకు, జర్నలిస్టులకు ఏమాత్రం క్షేమకరం కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCB మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరినప్పటికీ, వారు అంగీకరించలేదని, భద్రతా దృష్ట్యా భారత్‌లో ఆడటం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.
కాగా వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో తమ జాతీయ జట్టును స్కాట్లాండ్‌తో భర్తీ చేయాలనే ఐసీసీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శనివారం తెలిపింది, ఇప్పుడు తాము చేయగలిగింది ఏమీ లేదని తెలిపింది. వచ్చే నెలలో భారతదేశం మరియు శ్రీలంకలో సంయుక్తంగా జరగనున్న T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ICC శనివారం ధృవీకరించింది.