ఐపీఎల్ కు కామెంటరీ చేయబోతున్న నందమూరి బాలకృష్ణ

Balakrishna Teams Up With Star Sports Telugu for IPL 2023. నందమూరి బాలకృష్ణ.. ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ గా మారిపోయారు.

By Medi Samrat  Published on  26 March 2023 4:58 PM IST
ఐపీఎల్ కు కామెంటరీ చేయబోతున్న నందమూరి బాలకృష్ణ

Balakrishna Teams Up With Star Sports Telugu for IPL 2023


నందమూరి బాలకృష్ణ.. ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ గా మారిపోయారు. ఎవరూ ఊహించని విధంగా టాక్ షో చేసి 'అన్ స్టాపబుల్' అనిపించుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా క్రికెట్ కామెంటరీ ఇవ్వబోతున్నారు. నిజమండీ బాబు.. అఫీషియల్ గా చెప్పారు మన బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని..!

త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2023 సీజన్‌తో వ్యాఖ్యాతగా మారనున్నారు నందమూరి నట సింహం. స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు ఛానల్‌ ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కామెంట్రీ బాక్స్‌లో నందమూరి బాలకృష్ణ, వేణుగోపాల్‌ రావు, ఎంఎస్‌కే ప్రసాద్‌, ఆశిష్‌ రెడ్డి, కళ్యాణ్‌ కృష్ణ, టి సుమన్‌ లు ఉండనున్నారు. బాలయ్య తనదైన శైలిలో చెప్పే కామెంటరీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. బాలయ్య ఎలా కామెంటరీ చేస్తారో అనే ఊహాగానాలు కూడా అభిమానుల్లో మొదలయ్యాయి. మార్చి 31న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభంకానుంది.


Next Story