Balakrishna : ఆ ఎమ్మెల్యేపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna Serious On YSRCP MLA. సినిమాను సినిమాల లాగే చూడాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హితవు పలికారు.

By M.S.R  Published on  15 March 2023 2:45 PM IST
Balakrishna : ఆ ఎమ్మెల్యేపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna


సినిమాను సినిమాల లాగే చూడాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హితవు పలికారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వివాదంపై బాలయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దని ఓ వైసీపీ ఎమ్మెల్యేను హెచ్చరించారు. నరసరావుపేటలో తమ పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని, ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోనని అన్నారు.

‘మొన్న నర్ససారావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారు. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడు కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త.' అంటూ హెచ్చరించారు నందమూరి బాలకృష్ణ. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను సిద్ధమే.. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండని బాలకృష్ణ హెచ్చరించారు.


Next Story