మరో వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Hero Balakrishna is caught in another controversy. నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రో వివాదం చిక్కుకున్నారు. తాజాగా న‌ర్సుల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Feb 2023 5:28 PM IST
మరో వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రో వివాదం చిక్కుకున్నారు. తాజాగా న‌ర్సుల సంఘం బాల‌కృష్ణ వ్యాఖ్యలను త‌ప్పు ప‌డుతోంది. బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ లో చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. నర్సుల‌పై బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ న‌ర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌చ్చంద ప్ర‌సాద్ అన్నారు.

Hero Balakrishna is caught in another controversyబాల‌కృష్ణ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లో ప్ర‌సారమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌లో త‌నకు యాక్సిడెంట్ జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వివ‌రిస్తున్న సందర్భంలో న‌ర్సు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని న‌ర్సుల సంఘం డిమాండ్ చేసింది. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం కరెక్ట్ కాదని నర్సులు అంటున్నారు.



Next Story