భారత్ ఖాతాలో మరో కాంస్యం.. భ‌ళా భ‌జ‌రంగ్..!

Bajrang Punia wins bronze. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పత‌కం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భ‌జ‌రంగ్ పూనియా

By Medi Samrat  Published on  7 Aug 2021 11:31 AM GMT
భారత్ ఖాతాలో మరో కాంస్యం.. భ‌ళా భ‌జ‌రంగ్..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పత‌కం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భ‌జ‌రంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పత‌కం సాధిం చాడు. అయితే.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భ‌జ‌రంగ్ నేడు కాంస్య పత‌కం కోసం జ‌రిగిన‌ మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భ‌జ‌రంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

భ‌జ‌రంగ్ పూనియా కాంస్యంతో కలిపి టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు ఆరు పత‌కాలు సాధించింది. మొత్తం ఆరులో రెండు రజతాలు కాగా నాలుగు కాంస్యాలు. ఇంత‌కుముందు వెయిట్‌ లిఫ్టర్‌ మీరా బాయి చాను రజతం, షట్లర్‌ పీవీ సింధు కాంస్య పతకం, బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ కాంస్యం, పురుషుల హాకీ టీం కాంస్య ప‌త‌కం, ర‌వి దాహియా ర‌జ‌తం సాధించ‌గా.. తాజ‌గా భ‌జ‌రంగ్ పూనియా కాంస్యం సాధించాడు. ఇక ఈరోజు మరో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ లో పోటీపడనున్నాడు.

భజరంగ్ పతక సాధనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. టోక్యో నుంచి సంతోషకరమైన వార్త అందిందని తెలిపారు. భజరంగ్ కళ్లు చెదిరే పోరాటం కనబర్చాడని కితాబునిచ్చారు. "ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే విజయం సాధించినందుకు నీకు శుభాభినందనలు" అంటూ భజరంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.



Next Story