టీ20 ప్రపంచ క‌ప్‌ విజేత ఆస్ట్రేలియా

Australia win maiden T20 World Cup. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా

By Medi Samrat  Published on  15 Nov 2021 4:06 AM GMT
టీ20 ప్రపంచ క‌ప్‌ విజేత ఆస్ట్రేలియా

దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తలప‌డ్డాయి. తొలుత‌ న్యూజిలాండ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను కోల్పో యి చేధించింది. దీంతో ఆస్ట్రేలియా పొట్టి ఫార్మ‌ట్‌లో తొలి టైటిల్‌ను ముద్దాడింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు వ‌చ్చిన కివీస్ ఓపెన‌ర్ల‌లో మిచెల్‌ (11) పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్స్ తో కలిసి మ‌రో ఓపెన‌ర్ మార్టిన్‌ గప్తిల్(28) ఇన్నింగ్సు చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ గ‌ప్తిల్ క్రీజులో ఇబ్బందిప‌డ్డాడు. 35 బంతులు ఎదుర్కొని కేవ‌లం 28 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిస్ర్ర‌మించాడు. తర్వాత ఫిలిప్స్(18) పరుగులు చేసి ఔటయ్యాడు. అప్ప‌టివ‌ర‌కూ నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు.ఈ క్రమంలోనే అర్ధశతకం నమోదు చేశాడు. ధాటిగా ఆడుతున్న క్రమంలోనే కేన్‌ విలియమ్సన్‌ 48 బంతుల్లో (10 ఫోర్లు, 3 సిక్సర్లు) 85 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివర్లలో సీఫర్ట్‌(8), నీషమ్‌(13), ఎగస్ట్రాలు(9) పరుగులు చేయ‌డంతో న్యూజిలాండ్‌ 172 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, జంపా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ 5 పరుగులు చేసిన త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు కలసి వికెట్ పడకుండా ఆచి తూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు న‌డిపారు. క్రీజులో కుదురుకున్నాక ఇరువురూ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడారు. వార్నర్ 38 బంతుల్లో 53 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 77 నాటౌట్ (6 ఫోర్లు 4 సిక్సర్లు) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మాక్స్‌వెల్‌ నాటౌట్ 18 బంతుల్లో 28 (4 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఇరువురు ధాటిగా ఆడ‌టంతో 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 173 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ రెండు వికెట్లు తీశాడు.


Next Story