ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ఆటగాడు ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. మంగళవారం ఉదయం ఎంసీజీ మైదానంలో ఈ విషయాన్ని ఫించ్ స్వయంగా వెల్లడించాడు. అనంతరం ఓ ప్రకటనను కూడా విడుదల చేశాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న ఫించ్ తాజాగా టీ20లకు కూడా వీడ్కోలు పలికాడు.
"2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో నేను ఆడబోనని నాకు అర్థమైంది. ఆ టోర్నీకి జట్టు సిద్ధం అవ్వాలంటే నేను ఇప్పుడే జట్టు నుంచి తప్పుకోవడం కరెక్ట్ అని అనిపించింది. నాకు మద్దతుగా నిలిచిన నా భార్య అమీ, సహచర ఆటగాళ్లు, క్రికెట్ ఆస్ట్రేలియా తదితరులందరికి కృతజ్ఞతలు" అని ఫించ్ అన్నాడు. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ లు గెలవడం నా కెరీర్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిలిపోతాయి అని ఫించ్ చెప్పాడు.
ఫింఛ్ తన కెరీర్‌లో 146 వన్డేల్లో 5406 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. 103 టీ20లు ఆడి 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సహా 3120 పరుగులు సాధించాడు. 5 టెస్ట్ మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు.