నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 91 పరుగులకు భారత్ కట్టడి చేసింది. ఈ ప్రదర్శనతో అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 31వ సారి 5 వికెట్లు తీసుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ (120), అక్షర్ పటేల్ (84) రాణించడంతో భారత్ 400 పరుగులు చేసింది. దీంతో 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీశాడు. అతనికి ఇతర ఆస్ట్రేలియా బౌలర్ల నుండి మద్దతు దొరకలేదు. అంతకుముందు కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్ల ధాటికి భారత్ ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్సులో 177 పరుగులకే కట్టడి చేసింది.