కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ

అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు

By Medi Samrat  Published on  17 Oct 2024 3:00 PM GMT
కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ

అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పొజిషన్‌లో లేనందుకు సర్ఫరాజ్ ఖాన్‌పై అరిచేశాడు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. ఇది స్వదేశంలో భారత జట్టు అత్యల్ప స్కోరు.

రోహిత్, సర్ఫరాజ్ మధ్య జరిగిన సంఘటన భారత జట్టులో ఉద్రిక్త వాతావరణాన్ని హైలైట్ చేసింది. న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ టామ్ లాథమ్, డెవాన్ కాన్వేల వికెట్ల కోసం తీవ్రంగా భారత జట్టు శ్రమిస్తున్నప్పుడు రోహిత్ అలా సర్ఫరాజ్ ను తిట్టడం జరిగింది. కివీస్ స్కోరు 27 పరుగులు ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది. లంచ్ బ్రేక్ వరకు టీమ్ ఇండియా 34/6 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత మ‌రో 12 ప‌రుగులు చేసి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. కేవలం 46 ప‌రుగుల‌కు భారత్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ల‌లో య‌శ‌స్వీ జైస్వాల్‌(13), పంత్‌(20) త‌ప్ప అంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భారత్‌కు చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెర‌వ‌కుండానే అవుట్ అయ్యారు. న్యూజీలాండ్ బౌల‌ర్ల‌లో విలియ‌మ్ నాలుగు, హెన్వీ ఐదు, సౌతి ఒక వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు.

Next Story