Video : ఒక‌వేళ ఇండియ‌న్ ఫ్యాన్ ఫోటో అడిగితే మాత్రం కొడ‌తావా.. మిస్ట‌ర్ హరీస్ రవూఫ్..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. లీగ్ దశలో అమెరికా పాక్ జట్టు ఓటమిని కూడా చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on  18 Jun 2024 11:10 AM GMT
Video : ఒక‌వేళ ఇండియ‌న్ ఫ్యాన్ ఫోటో అడిగితే మాత్రం కొడ‌తావా.. మిస్ట‌ర్ హరీస్ రవూఫ్..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. లీగ్ దశలో అమెరికా పాక్ జట్టు ఓటమిని కూడా చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత పాక్‌ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితుల‌లో చాలా మంది ఆటగాళ్ళు వెంటనే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే యోచ‌న‌లో కూడా లేన‌ట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత బోర్డు కూడా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉండడంతో పాక్ ఆటగాళ్ల కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ భిన్నమైన వివాదంలో చిక్కుకున్నాడు. అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో అతడు గొడవ ప‌డుతూ కనిపించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హరీస్ రవూఫ్ తన భార్యతో కలిసి కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమానితో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్చ ఎందుకు మొదలైందో.. ఎలా గొడవకు దారి తీసిందో అర్థం కాని పరిస్థితి. హరీస్ హఠాత్తుగా భార్య చేయి విడిపించుకుని ఫ్యాన్ వైపు పరుగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో కొంతమంది జోక్యం చేసుకుంటారు. హరీస్ రవూఫ్ గొడవ పడ్డ అభిమాని పిక్చర్ అడిగాను అన్న మాటలు వినిపిస్తున్నాయి. నేను అభిమానిని.. మీతో ఒక ఫోటో అడిగాను అన్న‌ట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘ‌ట‌న‌ తర్వాత హరీస్ వెనక్కి తగ్గాడు.. ఇది మీ భారతదేశం కాదు అని అభిమానితో చెప్పాడు. దీనిపై అభిమాని స్పందిస్తూ.. తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని చెప్పాడు. దీని తర్వాత హరీస్ అభిమానితో.. ఇది మీకు అలవాటే అని చెప్పాడు.

ప్రపంచకప్‌లో తమ పేలవమైన ప్రదర్శన కారణంగా ఆటగాళ్లు ఎంత నిరాశకు లోనవుతున్నారో చెప్పేందుకు పాక్ ఆటగాళ్లు అభిమానుల పట్ల ప్రవర్తించిన తీరు సరిపోతుంది. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ దశలో అమెరికా, భారత్‌తో మ్యాచ్‌ల‌లో ఓడిపోవడంతో టోర్నమెంట్ నుండి త్వరగా నిష్క్రమించాల్సి వచ్చింది.

Next Story